Annie Raja: కేరళ(Kerala)లోని వయనాడ్(Wayanad) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన వాయనాడ్ లో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా(CPI candidate) అన్నే రాజా(Annie Raja) పోటీ చేయనున్నారు. ఆమె కూడా ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ భాగస్వామిగా సీపీఐ పోటీలో నిలిచింది. ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీలు అయిన కాంగ్రెస్, సీపీఐ.. కేరళలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు. సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా భార్య అయిన అన్నే రాజాకు.. పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ బృందంలో సభ్యత్వం ఉన్నది.
We’re now on WhatsApp. Click to Join.
కన్నౌర్ జిల్లాలోని ఇరిట్టిలో ఆమె జన్మించారు. సీపీఐ స్టూడెంట్ వింగ్‌లో ఆమె పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌తో పాటు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్‌లో ఆమె చేశారు. సీపీఐ వుమెన్ వింగ్ కన్నౌర్ జిల్లా కార్యదర్శిగా చేశారు. పార్టీలో ఆమె కీలక నేతగా ఆవిర్భవించారు. మహిళల పట్ల అకృత్యాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
Read Also: Virat Kohli : విరాట్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న యువకుడు..ఏంచేసాడో తెలుసా..?
కాగా, నామినేషన్ వేసేందుకు రాహుల్ గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రాగా, కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ వేసే ముందు జన సందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో, వాయనాడ్ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానని రాహుల్ అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను అని తెలిపారు.