AP Minister: విశాఖ ఆర్కే బీచ్‌లో ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం

విశాఖ ఆర్కే బీచ్‌లో ఏపీ మంత్రి (AP Minister) ఆదిమూలపు సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బీచ్‌లో ఆయన పారా గ్లైడింగ్ చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో ఇంజన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.

Published By: HashtagU Telugu Desk
AP Minister

Resizeimagesize (1280 X 720)

విశాఖ ఆర్కే బీచ్‌లో ఏపీ మంత్రి (AP Minister) ఆదిమూలపు సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బీచ్‌లో ఆయన పారా గ్లైడింగ్ చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో ఇంజన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దానిని కింద పడకుండా వెంటనే సిబ్బంది పట్టుకున్నారు. ఆ సమయంలో మంత్రులు అమర్‌నాథ్, విడుదల రజని కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులపై కలెక్టర్ మల్లికార్జున అసహనం వ్యక్తం చేశారు.

Also Read: Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు

విశాఖ ఆర్‌కే బీచ్‌లో జీ 20 సదస్సు సన్నాహక మారథాన్‌ను ఆదివారం ఉదయం మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని ప్రారంభించారు. 5కే, 10కే మారథన్‌లను వారు ప్రారంభించారు. అయితే మారథాన్‌ను ప్రారంభించిన అనంతరం.. నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ పారా గ్లైడింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సిబ్బంది అప్రమత్తతో తృటిలో ప్రమాదం తప్పింది.

  Last Updated: 26 Mar 2023, 09:43 AM IST