AP Assembly – Next Week : రేపు ప్రధాని మోడీతో జగన్ భేటీ.. వచ్చే వారం ఏపీ అసెంబ్లీ

AP Assembly - Next Week : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారం జరగనున్నాయి.

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 01:24 PM IST

AP Assembly – Next Week : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారం జరగనున్నాయి. ఈవిషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వచ్చే వారం జరగనున్న అసెంబ్లీ సెషన్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు ఉదయం లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చీఫ్ విప్ ప్రసాదరాజు.. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని ప్రకటించారు. రేపు (బుధవారం) సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో బీజేపీ పెద్దలతో సీఎం జగన్ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also read :  Virat Kohli: 15 గంటల వ్యవధిలో రెండో మ్యాచ్.. అలసిపోయానంటూ కోహ్లీ కామెంట్..!

ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే.. 

ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే సీఎం జగన్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని (AP Assembly – Next Week) నిర్వహించనున్నారు. ఇందులో పలు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించే  ఛాన్స్ ఉంది.  దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చనే దానిపై.. క్యాబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ సిగ్నల్స్ ఇస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక వైసీపీ కూడా  ముందస్తు ఎన్నికలకు మొదటి నుంచీ అనుకూలంగానే ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిపినా తాము సిద్ధమే అని ఆ పార్టీ నేతలు తరుచూ చెబుతున్నారు. క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాల ఆధారంగా వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారని సమాచారం.