Site icon HashtagU Telugu

Andhra Pradesh: విశాఖపట్నంలో విషాదం.. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Andhra Pradesh

New Web Story Copy 2023 08 09t152217.400

విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది.విశాఖ మర్రిపాలెం ప్రకాష్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో సంధ్య అనే మహిళ నివాసం ఉంటున్నది. ఆమెకు 9 ఏళ్ళ గౌతమ్, ఐదేళ్ల అలేఖ్య ఉన్నారు. అయితే గత అర్ధరాత్రి ఆమె తన పిల్లల్ని తీసుకుని ముందుగా పిల్లల్ని సంపులోకి తోసేసింది. ఆ తరువాత ఆమె నీటి సంపులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మృతులు సదరు అపార్ట్మెంట్ లో పని చేస్తున్న వాచ్ మెన్ కుటుంబానికి దగ్గరి బంధువులే కావడం అనుమానాలకు దాసరి తీసింది. అయితే ఈ ఆత్మహత్య వెనుక కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు వాచ్‌మెన్‌ను విచారిస్తున్నారు.

Also Read: Mukesh Ambani: ఏకంగా అన్ని రూ. కోట్లకు లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముఖేష్ అంబానీ?