Betting Apps case : వైసీపీ నేత, ప్రముఖ యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై ఈ రోజే విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్ గేమ్ ప్రమోట్ చేసిన శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ఆమె పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది.
Read Also: Gold Jewellery: బంగారు నగలు అమ్మినా.. తాకట్టు పెట్టినా.. ఇవి తెలుసుకోండి
మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నెం.393/2025 కింద 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3, 3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్లతో కేసులు బుక్ చేశారు. అదేవిధంగా విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. ఇకసామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు నిన్న సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
కాగా, నోటీసులు అందుకున్న వాళ్లలో దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాత్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత ఉన్నారు.