Speed Cubing 3 Seconds : 3 సెకన్లలో స్పీడ్‌ క్యూబింగ్.. కొత్త వరల్డ్ రికార్డ్

Speed Cubing 3 Seconds : మీరు ఒకసారి వాటర్ బాటిల్ మూత తెరవండి..  తెరిచారా ? ఎంత టైం పట్టింది ?ఆ టైం కంటే తక్కువ టైంలోనే రూబిక్స్ క్యూబ్‌ను ఒక కుర్రాడు సాల్వ్ చేశాడు..

Published By: HashtagU Telugu Desk
Speed Cubing 3 Seconds

Speed Cubing 3 Seconds

Speed Cubing 3 Seconds : మీరు ఒకసారి వాటర్ బాటిల్ మూత తెరవండి..  

తెరిచారా ?

ఎంత టైం పట్టింది ?

ఆ టైం కంటే తక్కువ టైంలోనే రూబిక్స్ క్యూబ్‌ను ఒక కుర్రాడు సాల్వ్ చేశాడు.. 

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న స్పీడ్‌ క్యూబింగ్ పోటీలు అవి.. పోటీలు మొదలయ్యాయి.. ప్లేయర్స్ ఎవరి సీట్లపై వారు కూర్చున్నారు.. ఒక  కుర్రాడు పోటీ మొదలైన 3.13 సెకన్లలోనే గేమ్ ను క్లోజ్ చేశాడు. అరుస్తూ గెంతులు వేశాడు.. తాను గెలిచానని ప్రకటించాడు.. 3.13 సెకన్లలోనే(Speed Cubing 3 Seconds)  రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి కొత్త రికార్డును సృష్టించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటును సంపాదించాడు. రికార్డు మోత మోగించిన ఆ అబ్బాయి పేరు.. మ్యాక్స్ పార్క్. అంతకుముందు 2018లో చైనాకు చెందిన యుషెంగ్ డు 3x3x3 రూబిక్స్ క్యూబ్‌ను 3.47 సెకన్లలో పరిష్కరించాడు. ఇప్పుడు 21 ఏళ్ళ యువకుడు మ్యాక్స్ పార్క్ అంతకంటే 0.34 సెకన్ల ముందే రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేశాడు.

Also read : Guinness Record: 9 ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డు.. 4 సెకన్లలోనే రూబిక్స్ క్యూబ్‌ పరిష్కారం

ఆటిజంతో బాధపడుతున్నా.. ఆటలో సూపర్ స్టార్ అయ్యాడు

2022 సెప్టెంబర్ లో కూడా 4.86 సెకన్ల సగటుతో ఐదు 3x3x3 క్యూబ్‌లను మ్యాక్స్ పార్క్ సాల్వ్ చేశాడు. గతంలో 7x7x7 క్యూబ్‌ను కేవలం 1 నిమిషం 35 సెకన్లలో మ్యాక్స్ పార్క్ పరిష్కరించాడు. ఈ రికార్డు చిరకాలం నిలిచిపోతుందని అతడు అప్పట్లో చెప్పాడు. మ్యాక్స్ పార్క్ చిన్నతనం నుంచే ఆటిజంతో బాధపడుతున్నాడు.  ” మా అబ్బాయి వాటర్ బాటిల్ కూడా తెరవలేని స్థితిని ఎదుర్కొన్నాడు. ఈ రోజు అతడు ప్రపంచంలోనే గొప్ప స్పీడ్‌ క్యూబింగ్ ఆటగాడు. క్షణంలో క్యూబ్‌లను పరిష్కరించగలడు” అని మ్యాక్స్ పార్క్ తల్లిదండ్రులు షాన్, మిక్కీ చెప్పారు. 

  Last Updated: 16 Jun 2023, 11:03 AM IST