Kerala: కేరళలో దారుణం చోటుచేసుకుంది. అమెరికా నుంచి వచ్చిన 44 ఏళ్ళ మహిళపై ఇద్దరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు.మద్యం ఇచ్చి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
అమెరికా (America) సిటిజన్ జూలై 22న ఇండియాకు వచ్చింది. కేరళలోని కొల్లమ్ జిల్లాలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న ఆమెపై ఇద్దరు వ్యక్తులు కన్నేశారు. సమీపంలోని బీచ్ లో కూర్చుని ఉండగా మద్యం అఫర్ చేశారు. మద్యం సేవించిన సదరు మహిళను బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. మరునాడు బాధితురాలి కరునగపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్ 376డి, 376(2)(ఎన్) కింద కేసు నమోదు చేశారు.
Also Read: Oppo A78 Smartphone: మార్కెట్ లోకి ఒప్పో కొత్త ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?