Amazon Prime Membership : అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఎంతోమంది వినియోగిస్తుంటారు. వాళ్లందరికీ ఒక అప్‌డేట్. 2025 జనవరి నుంచి వాళ్లంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Agniveer Recruitment 2025 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ‘అగ్నివీర్ వాయు’ జాబ్స్
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్(Amazon Prime Membership) కలిగినవారు పాస్‌వర్డ్ షేరింగ్‌కు సంబంధించిన కొత్త రూల్‌ను తెలుసుకోవాలి. అమెజాన్ ప్రైమ్‌లో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఛార్జీ రూ.299. మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఛార్జీ రూ.599. వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఛార్జీ రూ.1499. మనం వీటిలో ఏ ప్లాన్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకున్నా.. ఇప్పటివరకూ 10 డివైస్‌లలో అమెజాన్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూస్తున్నాం. ఈ కారణం వల్లే ఒకరికి ఈ సబ్‌స్క్రిప్షన్ ఉంటే.. ఇంటిల్లిపాదీ దాన్ని యథేచ్ఛగా వాడేస్తున్నారు. ఫలితంగా అమెజాన్ ప్రైమ్‌కు కొత్త మెంబర్‌షిప్‌లు రావడం లేదు. అందువల్లే 2025 సంవత్సరం జనవరి నుంచి కొత్త రూల్‌ను అమల్లోకి తేనున్నారు.దీనిలో భాగంగా కేవలం ఐదు డివైజెస్‌లలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోను మనం రిజిస్టర్ చేసుకోగలం. దీంతోపాటు ఐదు డివైజ్‌లకుగానూ రెండు టీవీ డివైజ్‌లలో మాత్రమే ఏకకాలంలో ఓటీటీని చూడగలం. ఇందుకోసం అమెజాన్ యాప్‌లోని సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి.. రిజిస్టర్డ్ డివైజెస్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అందులో మనకు కావాల్సిన డివైజ్‌ల వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కరలేని డివైజ్‌లను అక్కడి నుంచి తీసేయొచ్చు. త్వరలోనే డిస్నీ హాట్‌స్టార్ కూడా పాస్ వర్డ్ షేరింగ్ పై నిబంధనలను తీసుకొస్తుందనే టాక్ వినిపిస్తోంది.
Also Read :Migrations to Hyderabad : హైదరాబాద్‌కు వలసల సునామీ.. ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు
నెట్ ఫ్లిక్స్ కంపెనీ ఇప్పటికే..
నెట్ ఫ్లిక్స్ కంపెనీ కూడా పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో ఈ ఏడాదే కఠినమైన రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. ఒకే వైఫై యాక్సెస్, ఒకే లొకేషన్ లో ఉండే వారిని ఒక హౌస్ హోల్డ్ గా తమ సబ్ స్క్రైబర్లను వర్గీకరించింది. ఎవరైనా వేరే లొకేషన్ నుంచి ఒక అకౌంట్ ను యాక్సెస్ చేయాలంటే , సదరు అకౌంట్ హోల్డర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారు యాక్సెస్ కోడ్ చెబితే, వేరే లొకేషన్ లో ఉన్నవాళ్లు సైతం అకౌంటులోకి లాగిన్ కావచ్చు. ఈ వెసులుబాటు సైతం నెట్ ఫ్లిక్స్ ప్రీమియం సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.