Site icon HashtagU Telugu

242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్ర‌మాదంలో 242 మంది మృతి

Air India Compensation

Air India Compensation

242 People Died: అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. అయితే ఈ ప్ర‌మాదంలో 242 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించిన‌ట్లు (242 People Died) అహ్మ‌దాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌మాదంలో ఒక్క‌రు కూడా బతికి ఉండే ఛాన్స్ లేద‌ని అసోసియేష‌న్ ప్రెస్ (ఏపీ) అనే అంత‌ర్జాతీయ సంస్థ‌కు చెప్పారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

కాగా విమానంలో సిబ్బంది, పైల‌ట్లు స‌హా మొత్తం 242 మంది ఉన్నారు. కమిషనర్ జి.ఎస్. మలిక్ తెలిపిన వివరాల ప్రకారం.. విమాన దుర్ఘటనలో ఎవరూ బతికి ఉండకపోవచ్చని అనిపిస్తోంది. విమానం రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలిపోయినందున కొంతమంది స్థానికులు కూడా మరణించి ఉండవచ్చు అని అన్నారు. అయితే ఈ ప్ర‌మాదంలో గుజ‌రాత్ మాజీ సీఎం విజ‌య్‌ రూపానీ కూడా మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది.

Also Read: Plane Crash: ఇండియాకు వీడ్కోలు పలికిన జేమీ మీక్.. విమానం క్రాష్ కు ముందు వీడియో పోస్ట్

ఈ దుర్ఘటన తర్వాత అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పరిమిత విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కోసం వెంటనే భారత సాయుధ బలగాల బృందాలు రంగంలోకి దిగాయి.

అంతేకాకుండా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇతర ఏజెన్సీలు కూడా సాయుధ బలగాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సైన్యం తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఈ బలగాల బృందంలో మెడికల్ టీమ్, ఇతర రెస్క్యూ సిబ్బంది ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ.. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహ‌న్‌ నాయుడుతో మాట్లాడారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన గురించి సమాచారం సేక‌రించారు. ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రికి అన్ని అవసరమైన సహాయాలను తక్షణం అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా అహ్మదాబాద్‌లో అన్ని సంబంధిత ఏజెన్సీలను హై అలర్ట్‌పై ఉంచారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే క్రాష్ అయింద‌ని పేర్కొన్నారు. విమానాశ్రయం సమీపంలోని మేఘానీ నగర్‌లో ఉన్న బీజే మెడికల్ కాలేజీ డాక్టర్ల రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌పై విమానం కూలిపోయిన‌ట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఆ కాంప్లెక్స్‌కు తీవ్ర నష్టం జరిగింది.