Site icon HashtagU Telugu

Chennai Express: తమళనాడులో రైలు కోచ్‌కు పగుళ్లు.. తప్పిన ప్రమాదం

Tamil Nadu

New Web Story Copy 2023 06 05t114917.472

Chennai Express: తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌కు చేరుకున్న చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ ను చూసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో పగుళ్లు కనిపించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన రైల్వే ఉద్యోగులు వెంటనే ఆ బోగీని రైలు నుండి వేరు చేసి, కొత్త కోచ్‌ను జోడించారు.

తమిళనాడులోని సెంగోట్టై స్టేషన్‌లో రైలు నంబర్ 16102 (కొల్లాం-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్) S3 కోచ్‌లో పగుళ్లు ఏర్పడినట్లు రైల్వే సిబ్బంది గుర్తించినట్లు దక్షిణ రైల్వే తెలిపింది. వెంటనే రైల్వే సిబ్బంది రైలు నుంచి కోచ్‌ను వేరు చేసి ప్రయాణికులను ఇతర కోచ్‌లలో కూర్చోబెట్టారు. దీంతో మధ్యాహ్నం వెళ్లాల్సిన రైలు సాయంత్రం 4:40 గంటలకు కదిలింది.

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో రెండు వందల మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read More: Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం