Noorie Dog: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి ఇటీవల రాహుల్ గాంధీ ఓ బహుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి కుక్కను బహుమతిగా ఇస్తున్న వీడియోను గతంలో పోస్ట్ చేశారు. రాహుల్ ఇచ్చిన బహుమతికి సోనియా గాంధీ ఎంతో ముచ్చటపడింది. రాహుల్ ఇచ్చిన పెట్ డాగ్ కు నూరీ పేరు పెట్టడంపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్థానిక కోర్టును ఆశ్రయించారు. కుక్క పేరు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని అభ్యంతరం తెలుపుతున్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు మహ్మద్ ఫర్హాన్ మాట్లాడుతూ కుక్క పేరు మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, ‘నూరీ’ అనే పదం ఇస్లాంకు ప్రత్యేకంగా సంబంధించినది మరియు ఖురాన్‌లో కూడా ప్రస్తావన ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం నేత ఫర్హాన్ కోర్టును ఆశ్రయించినట్లు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కార్యాలయం ధృవీకరించింది.
ఫర్హాన్ తరపు న్యాయవాది మహ్మద్ అలీ మాట్లాడుతూ ఐపిసి సెక్షన్ 295 ఎ (మత మనోభావాలను దెబ్బతీయడం) కింద రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వారు జ్యుడికల్ మేజిస్రేట్ అవిరాల్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. కుక్క పేరు మార్చాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫర్హాన్ రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఫిర్యాదును పరిశీలించిన తర్వాత రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు పంపనున్నారు.
Also Read: Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్