Ahmedabad Plane Crash: కుప్ప‌కూలిన విమానం.. ఎయిర్ ఇండియా రియాక్ష‌న్ ఇదే!

అహ్మదాబాద్ పోలీసు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా నంబర్‌లను జారీ చేసింది. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా రెండు ఫోన్ నంబర్‌లను జారీ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash: గుజరాత్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన (Ahmedabad Plane Crash) విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘానీ నగర్ ప్రాంతంలో జూన్ 12న మధ్యాహ్నం లండ‌న్‌కు వెళ్తున్న‌ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. విమానంలో 10 మంది క్రూ సభ్యులతో సహా 242 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్పటివరకు 133 మంది మరణించినట్లు వార్తలు వ‌స్తున్నాయి. చాలా మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఈ విషయంలో ఎయిర్ ఇండియా తరపున హెల్ప్‌లైన్ నంబర్ జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఎయిర్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం.., ప్రయాణికులకు సంబంధించిన సమాచారం కోసం 1800 5691 444 అనే ప్యాసింజర్ హాట్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులకు తాము పూర్తి సహకారం అందిస్తున్నామని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Also Read: Balmuri Venkat: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై ఫిర్యాదు

అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 1:38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, క్రూ సభ్యులు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్ పౌరుడు, 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. కంపెనీ తమ ఎక్స్ హ్యాండిల్ https://x.com/airindia, http://airindia.com ద్వారా రెగ్యులర్ అప్‌డేట్‌ల ద్వారా మరిన్ని వివరాలను అందిస్తాన‌ని పేర్కొంది.

అహ్మదాబాద్ పోలీసు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా నంబర్‌లను జారీ చేసింది. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా రెండు ఫోన్ నంబర్‌లను జారీ చేసింది. ఒక ప్రకటనలో ఫ్లైట్ AI171 దుర్ఘటన సందర్భంగా అన్ని వివరాలను సమన్వయం చేయడానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖలో ఒక ఆపరేషనల్ కంట్రోల్ రూమ్‌ను యాక్టివేట్ చేశామని తెలిపింది. కాంటాక్ట్ నంబర్లు 011-24610843, 9650391859. అంతేకాకుండా పోలీసు ఎమర్జెన్సీ సర్వీసెస్, సమాచారం కోసం అహ్మదాబాద్ సిటీ పోలీసు కూడా ఎమర్జెన్సీ నంబర్‌ను జారీ చేసింది. ప్రజలు 07925620359 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.

 

  Last Updated: 12 Jun 2025, 04:58 PM IST