Metro QR Ticket: ఢిల్లీ తర్వాత పూణే మెట్రోలో QR కోడ్ టిక్కెట్ విధానం

కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మెట్రో QR ఆధారిత టికెట్ సేవను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆఫీసు పీక్ అవర్స్ లో టిక్కెట్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది.

Metro QR Ticket: కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మెట్రో QR ఆధారిత టికెట్ సేవను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆఫీసు పీక్ అవర్స్ లో టిక్కెట్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఈ సదుపాయం ప్రారంభించినప్పటి నుంచి ప్రజలు ఈజీగా టికెట్ కొనుక్కుంటున్నారు. ఇంటి నుండి బయలుదేరే సమయంలో టికెట్ బుక్ చేస్తున్నారు. ఈ సదుపాయంతో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం ఆదాయంలో వృద్ధి సాధిస్తుంది. గత రెండు నెలల ఆదాయంలో 1.5 శాతం వృద్ధి కనిపించింది.ఈ పరిస్థితిలో పూణే ప్రభుత్వం కూడా ఢిల్లీ మాదిరిగా QR ఆధారిత టికెట్ సేవను తీసుకురావాలని భావిస్తుంది. రాబోయే కాలంలో అనేక రాష్ట్రాలు మరియు నగరాలు ఈ విధానాన్ని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.

Also Read: CM KCR’s Campaign Vehicle : గులాబీ బాస్ ప్రచారం రథం సిద్ధం..