Site icon HashtagU Telugu

Teachers: స్కూల్‌లో విద్యార్థులతో లైంగిక చర్యలు.. ఆరుగురు టీచర్లు అరెస్ట్

Teacher

Teacher

Teachers: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు కొంతమంది సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు మంచి మాటలు చెప్పాల్సిన టీచర్లే చెడు పనులు చేస్తున్నారు. కొంతమంది టీచర్ల ప్రవర్తన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిపెడుతుంది. తాజాగా ఆరుగురు టీచర్లు స్కూల్‌లోని విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడ్డారు. దీంతో మహిళా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రెండు రోజుల వ్యవధిలోనే విద్యార్థులపై లైగింక చర్యలకు సంబంధించి మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు అమెరికా మీడియా తెలిపింది. దీంతో విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడిన ఆరుగురు టీచర్లను అరెస్ట్ చేశారు. వీరిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. కాలిఫోర్నియాలోని డానివిల్లే పట్టణానికి సంబంధించిన ఎలెన్ షెల్(38) అనే టీచర్ స్థానిక స్కూల్ లో పాఠాలు బోధిస్తోంది. అయితే ఇటీవల స్కూల్‌లోని ఇద్దరు 16 ఏళ్ల యువకులతో ఆమె లైంగిక చర్యలకు పాల్పడింది. అలాగే ఆర్కన్సాన్ రాష్ట్రానికి చెందిన హెథరే హరే అనే మహిళా టీచర్‌ కూడా విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.

అలాగే ఒక్లహామాకు చెందిన ఎమిలీ హాన్‌కాక్ అనే టీచర్ ఓ విద్యార్థితో లైంగిక సంబంధం నడుపుతున్నట్లు గుర్తించారు. అలాగే లిన్‌కాల్న్ కౌంటీలోని ఓ స్కూల్‌లో పనిచేస్తున్న ఎమ్మా డిలానె 15 ఏళ్ల విద్యార్థితో. అయోవా రాష్ట్రంలోని దేస్ మెయిన్స్ లో ఓ హైస్కూల్ లో పనిచేస్తున్న క్రిస్టెన్ గ్యాంట్ అనే టీచర్ టీనేజీ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు సీసీ టీవీ విజువల్స్ లో రికార్డు అయింది. దీంతో మొత్తం ఆరుగురు టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.