సోషల్ మీడియా (Social Media ) వల్ల ఎంత ఉపయోగం ఉందొ..అంత అపాయం ఉంది. స్మార్ట్ ఫోన్లు..ఫ్రీ ఇంటర్ నెట్ పుణ్యమా అని సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఎవరో తెలియని వారు సైతం రాత్రికిరాత్రే స్టార్స్ అవుతున్నారు. ఒకప్పుడు ప్రపంచంలో ఏంజరిగిన అది బయటకు రావడానికి కొన్ని గంటలు పట్టేది..కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఘటన జరిగిన సెకన్లలోనే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. అయితే ఈ సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని కొంతమంది అసత్యపు ప్రచారం చేయడం ఎక్కువై పోతుంది. ముఖ్యంగా సినీ స్టార్స్ విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ..బ్రతికున్న వారిని చంపేస్తున్నారు.
సోషల్ మీడియా లో సినీ స్టార్స్ (Cine Stars) కు సంబదించిన ఏ వార్త ప్రచారం చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ప్రేమ , పెళ్లి , హీరోయిన్స్ తో డేటింగ్ , హీరోల రెమ్యూనరేషన్ , అలాగే చావు వార్తలు బాగా వైరల్ అవుతుంటాయి. వాటిని చూసేందుకు కూడా నెటిజన్లు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అందుకే చాలామంది బ్రతికున్న వారిని చనిపోయినట్లు ప్రచారం చేసి పాపులర్ కావాలని చూస్తుంటారు. ఇప్పటికే చాలామంది విషయంలో ఇలా ప్రచారం చేయడం..ఆ ప్రచారం చూసి వారు మీము బ్రతికే ఉన్నామని ప్రకటించడం చేసారు. తాజాగా కన్నడ హీరోయిన్..మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య (Divya Spandana) విషయంలో అదే జరిగింది. సోషల్ మీడియా లో రమ్య చనిపోయారంటూ (Actress Divya Spandana aka Ramya death rumors) ప్రచారం చేయడం..ఇది నిజమే అనుకోని తమిళనాడులో కొన్ని టీవీ ఛానెళ్లు వార్తలు ప్రచారం చేయడం అందర్నీ షాక్ కు గురి చేసాయి. రమ్య గుండెపోటుతో మృతి చెందారని రాసుకొచ్చారు. ఇక చాలా మంది ఎక్స్ (ట్విట్టర్)లో రమ్య మృతికి సంతాపాలు కూడా తెలియజేశారు.
Read Also : Ghaziabad: కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. చివరికి రేబిస్ తో మృతి
ఒక ప్రముఖ పీఆర్ఓ ఈ వార్తను ముందుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. దీంతో వైరల్ అయ్యింది. అయితే, ఆయన తన తప్పును గ్రహించిన సదరు పీఆర్ఓ తన పోస్ట్‌ను డిలీట్ చేసేశారు. కానీ, అప్పటికే వార్త బాగా వైరల్ అయిపోయింది. దీంతో రమ్య కుటుంబ సభ్యులు స్పందించారు. ఆమె బాగానే ఉన్నారని.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఆమె ఉన్నారని స్పష్టం చేశారు. బెంగళూరులో పుట్టిపెరిగిన దివ్య స్పందన.. ‘అభి’ అనే కన్నడ సినిమా ద్వారా రమ్యగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన హీరోయిన్‌గా నటించారు. ఇక తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘అభిమన్యు’ సినిమాతో పరిచయమయ్యారు. ఆమె తెలుగులో చేసిన సినిమా ఇదొక్కటే.
2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన రమ్య.. 2013లో జరిగిన బై-ఎలక్షన్‌లో కర్ణాటకలోకి మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరవాత రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసినా ఓడిపోయారు. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు.
