Site icon HashtagU Telugu

NEET Exam : నీట్‌ని రద్దు చేయాలంటూ ప్రధానికి మమతా బెనర్జీ లేఖ

Mamatha Neet

Mamatha Neet

దేశ వ్యాప్తంగా గందరగోళం రేపిన నీట్‌ని (NEET Exam) రద్దు చేయాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ఈరోజు ప్రధాని మోదీ (PM Modi)కి లేఖ రాశారు. దేశంలోని రాష్ట్రాలు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించాలని.. పేపర్ లీక్, లంచాలు ఇవ్వడం వంటి ఘటనలు ఆశావహుల భవిష్యత్తును, విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా దేశంలోని వైద్య విద్య నాణ్యతను దెబ్బతీస్తాయని మమతా లేఖలో ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join.

భారత్ లో వైద్య సదుపాయాలు, వైద్య చికిత్స నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా భారత్ లోని వైద్య కోర్సుల్లో ప్రవేశాలపై పూర్తి నియంత్రణ సాధించేందుకు వీలుగా నీట్ తీసుకొచ్చారని చెప్పారు. ఇది సరైన విధానం కాదని అన్నారు. దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల విధానాన్ని పునరుద్ధరిస్తే దేశంలోని పరీక్షా విధానంలో గందరగోళం లేకుండా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు

ఇదిలా ఉంటె నీట్‌ (యూజీ) పరీక్షలో గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ఆదివారం (జూన్‌ 23) రీ ఎగ్జామ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. అయితే పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్ధులు గైర్హాజరయ్యారు. మొత్తం 1563 మందికి గానూ కేవలం 813 మంది మాత్రమే హాజరవడం చర్చణీయాంశంగా మారింది.

Read Also : Komatireddy Venkat Reddy : కేంద్రమంత్రి బండి సంజయ్ తో మంత్రి కోమటిరెడ్డి భేటీ