Amit Shah Sensational Announcement: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్ షా సంచలన ప్రకటన

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్‌షా సంచలన ప్రకటన చేశారు. రిజర్వేషన్ లు బీసీ , ఎస్సి, ఎస్టీ లకు మాత్రమే ఉండాలని అన్నారు.

  • Written By:
  • Updated On - April 23, 2023 / 08:42 PM IST

Amit Shah Sensational Announcement : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. రిజర్వేషన్ లు బీసీ, ఎస్సి, ఎస్టీ లకు మాత్రమే ఉండాలని అన్నారు. కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని విమర్శించారు.

‘ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రధాని కావాలని ఎన్నో కలలు కంటున్నారు. ప్రధాని సీటు ఖాళీగా లేదని తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే ప్రధాని. కేసీఆర్‌ సీఎం సీటు కాపాడుకోవాలి. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉంది. ఎంఐఎం కు భయపడే విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు. ఓవైసీ ఎజెండానే కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. కేసీఆర్‌ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లది. ఎంఐఎంకు బీజేపీ భయపడదు’’ అని అమిత్‌షా (Amit Shah) స్పష్టం చేశారు.

తొమ్మిదేళ్లుగా ఏళ్లుగా బీఆర్ఎస్‌ (అవినీతి పాలన సాగిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ని అరెస్ట్‌ చేస్తారా? ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారు? అని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్‌ లీక్‌ అవుతోందని, పేపర్‌ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ స్పందించలేదని తప్పుబట్టారు. పేపర్‌ లీక్‌ ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలను మోదీ నుంచి దూరం చేయలేరని అమిత్‌షా తేల్చిచెప్పారు. ఆయన సభ అంతా వచ్చే ఎన్నికలకు అడుగు వేసేలా సాగింది.

అంచనాలకు తగ్గట్టే ‘చేవెళ్ల విజయ సంకల్ప సభ’లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావాలా వద్దా?.. ఢిల్లీలోని ప్రధాని మోదీకి వినపడేలా ప్రజలు నినాదించాలని అని అమిత్‌షా పిలుపునిచ్చారు. బీజేపీ మార్క్ ప్రచారం వచ్చే ఎన్నికలకు ప్రారంభమైనట్టే.

Also Read:  Salary Account vs Savings Account: మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి..