AAP : రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు ఆప్ మ‌ద్ద‌తు – ఎంపీ సంజ‌య్ సింగ్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆప్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తుందని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం పార్టీ రాజకీయ సలహా కమిటీ (పీఏసీ) సమావేశం అనంతరం తెలిపారు

  • Written By:
  • Publish Date - July 16, 2022 / 02:34 PM IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆప్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తుందని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం పార్టీ రాజకీయ సలహా కమిటీ (పీఏసీ) సమావేశం అనంతరం తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎంపిక చేసిన అభ్యర్థి ద్రౌపది ముర్ముతో దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి సిన్హా పోటీలో ఉన్నారు తాము ద్రౌపది ముర్మును గౌరవిస్తామని.. అయితే ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆప్‌ మద్దతు ఇస్తుందని సంజ‌య్‌ సింగ్ అన్నారు. ఈ సమావేశానికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, పంజాబ్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మెల్యే అతిషి, ఇతర పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉన్న ఏకైక బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీ ఆప్ మాత్రమే. ఇందులో ఢిల్లీ నుంచి ముగ్గురు సహా రెండు రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అలాగే పంజాబ్‌లో 92, ఢిల్లీలో 62, గోవాలో ఇద్దరు సహా మొత్తం 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.