Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాములో ఆరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీ కేసులతో కేజ్రీవాల్ బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అటు కేజ్రీవాల్ ఆరోగ్యంపై కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతలు తన ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేజ్రీవాల్ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటూ ఆప్ నేత సంచలన ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు.ఫేక్ కేసులో కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచడం ద్వారా ప్రభుత్వం తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆయన ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆందోళన చెందారు. ఏదైనా జరగరానిది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. మార్చి 21 నుండి కేజ్రీవాల్ బరువు ఎనిమిదిన్నర కిలోలు తగ్గినట్లు చెప్పారు. 70 కిలోల నుంచి దాదాపు 61.5 కిలోలకు తగ్గింది. ఈ బరువు ఎందుకు తగ్గుతుందో తెలియదు. అతని షుగర్ లెవెల్ రాత్రిపూట అకస్మాత్తుగా 50 కంటే తక్కువకు వెళ్లింది. ఈ పరిస్థితిలో ఎవరైనా కోమాలోకి కూడా వెళ్ళవచ్చు. రాత్రిపూట జైలులో డాక్టర్ కూడా లేరని ఆందోళన చెందారు ఆయన. .
కేజ్రీవాల్‌ను జైలు నుండి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అతనికి సరిగ్గా పరీక్షించి చికిత్స అందించాలి. అయితే జైలు నుంచి బయటకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. అటువంటి పరిస్థితిలో కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం జూన్ 25న రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని జరుపుకోవాలనుకుంటే, మహాత్మా గాంధీని హత్య చేసిన జనవరి 30తో పాటు రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Also Read; HYD : సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా..? అందుకే గ్రేటర్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాడా..?