Site icon HashtagU Telugu

Watch Video: పోకిరీని చితకబాదిన బెజవాడ అమ్మాయి!

Bejawada

Bejawada

కాలేజీ అమ్మాయిలు, బాలికలు, యువతలను ఆకతాయిలు టీజింగ్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు అమ్మాయిలు మౌనంగా వేదనను అనుభవిస్తుంటే.. మరికొందరు పోకిరీల ఆగడాలను తిప్పికొడుతున్నారు. బహిరంగంగానే దేహశుద్ది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని గన్నవరం కు చెందిన ఓ అమ్మాయి పోకిరీ ఆట కట్టించి శభాష్ అనిపించుకుంటోంది. ఎయిర్ పోర్ట్ లో పని ముగించుకొని రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా, ఓ ఆకతాయి బైక్‌పై ఫాలో చేస్తూ ఇబ్బందికి గురిచేశాడు. దీంతో యువతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి.. దేహశుద్ధి చేసింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి ప్రయత్నాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటూ శభాష్ సిస్టర్ అని అంటున్నారు.