Site icon HashtagU Telugu

Suicide : ఆత్మ‌హ‌త్య చేసుకున్న న‌వ దంప‌తులు.. కార‌ణం ఇదే..?

Deaths

Deaths

శ్రీ స‌త్య‌ సాయి జిల్లాలో విషాదం నెల‌కొంది. జిల్లాలోని రామగిరి మండలం గంగంపల్లిలో బుధవారం అర్థరాత్రి యువ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మృతులను దాదా (30), జ్యోత్స్న (26)గా గుర్తించారు. కుటుంబాల మధ్య వివాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదా, జ్యోత్స్న కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, మూడు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని గ్రామానికి తిరిగివచ్చార‌ని పోలీసులు తెలిపారు. కొద్దిరోజులుగా ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవలు జరిగినా, చివరకు ఒప్పించి దాదా, జ్యోత్స్న కలిసి ఉండడం ప్రారంభించారు. కాగా.. బుధవారం సాయంత్రం తమ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  Murder : ప‌ల్నాడు జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు హ‌త్య‌