Site icon HashtagU Telugu

Shadnagar Fire: షాద్ నగర్ అగ్ని ప్రమాదంలో 50 మందిని తాడు సహాయంతో కాపాడిన బాలుడు

Shadnagar Fire

Shadnagar Fire

Shadnagar Fire: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది సిబ్బంది చిక్కుకున్నారు. మంటలు భయంకరంగా ఎగసిపడుతుండగా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు ఉద్యోగులు కిటికీల నుండి దూకవలసి వచ్చింది. అయితే వాళ్లందరిని ఓ పిల్లవాడు తన తెలివితేటలతో రక్షించాడు. ఫార్మా కంపెనీ నుంచి మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన సాయి చరణ్‌ వెంటనే తాడు తెచ్చి భవనంపైకి విసిరి కార్మికులందరినీ రక్షించాడు. అందులో దాదాపు 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం.

Shadnagar Fire

We’re now on WhatsAppClick to Join

తాడు సాయంతో అందరూ బయటకు వచ్చారు. భవనంలో మంటలు చెలరేగినప్పటికీ వారు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కాగా సంఘటనా స్థలంలో ఉన్న సీనియర్ పోలీసు అధికారులు బాలుడిని అభినందించారు. ఈ ప్రమాదం నుంచి కాపాడినందుకు గాను సాయి చరణ్ ను హీరో అంటూ ప్రశంసించారు. ఇదిలా ఉండగా ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. కొందరు స్పృహ కోల్పోవడంతో బాధితుల్ని స్థానికి ఆస్పత్రికి తరలించారు.

Also Read: KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్‌.. మోడీ బడే భాయ్‌: కేసీఆర్