ఆసక్తి ఉంటే ఎక్కడి నుంచైనా.. ఏ విషయంలోనైనా దుమ్ము లేపొచ్చని వాళ్ళు నిరూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు(UP jails inmates) టెన్త్ , ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ లో దుమ్ము లేపారు. 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్షలకు హాజరైన 60 మంది ఖైదీల్లో(UP jails inmates) 57 మంది పాస్ కావడం విశేషం. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ఖైదీలకు 82.4 శాతం మార్కులు వచ్చాయి. ఇక ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ కు 64 మంది ఖైదీలు హాజరవ్వగా .. 45 మంది పాస్ అయ్యారు. అంటే 70.30 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలోనూ ఆరుగురు ఖైదీలు ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించారు.
ALSO READ : Tillu Tajpuriya : తీహార్ జైల్ గ్యాంగ్ వార్.. ఏకంగా 100 సార్లు పొడిచి చంపారు.. సీసీటీవీలో నమోదు..
ఈవివరాలు ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 25న ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. ఈ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే క్రమంలో తాము అందించిన సహకారం గురించి వివరించారు. ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో వారికి జైలులో తక్కువ పనులు అప్పగించామని తెలిపారు. పరీక్షలు రాస్తున్న సమయంలో వారిని పనుల నుంచి మినహాయించామని చెప్పారు. జైలులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందించామని.. లైబ్రరీ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 10 జైళ్లలో ఖైదీల కోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.