Site icon HashtagU Telugu

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో 9 మంది మృతి

Manipur Violence

A committee on Manipur Violence under Governor Anusuiya Uikey

Manipur: హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్‌ (Manipur)లో శాంతి ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అందిన సమాచారం ప్రకారం.. మణిపూర్‌ (Manipur)లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లోక్ ప్రాంతంలో తాజాగా జరిగిన హింసలో తొమ్మిది మంది మరణించారు. ఈ హింసలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ఇండియా టుడే కథనం ప్రకారం.. మంగళవారం (జూన్ 13) ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక కాల్పుల్లో 9 మంది మరణించారు. సుమారు 10 మంది గాయపడ్డారు.

గత 24 గంటల్లో మణిపూర్‌లో తాజా హింస చెలరేగడంతో ఒక మహిళ సహా తొమ్మిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఖమెన్‌లోక్ ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో ఈ మరణాలు సంభవించాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. చాలా మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇంఫాల్‌కు తరలించారు. హింసాకాండలో మరణించిన వారిలో కొందరి శరీరాలపై గాయాలు కూడా ఉన్నాయి. చాలా మందికి బుల్లెట్ గాయాలు ఉన్నాయి.

Also Read: Biparjoy: పాకిస్థాన్ కు కూడా “బిపార్జోయ్” ముప్పు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పాక్ ఆర్మీ..!

తాజా హింసాకాండలో 10 మంది గాయపడ్డారని ఇంఫాల్ ఈస్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) శివకాంత్ సింగ్ చెప్పినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. మృతులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, వారి మరణానికి కారణమేమిటో కరెక్ట్‌గా నిర్ధారిస్తామని చెప్పారు. జాతి ఘర్షణల కారణంగా ఒక నెలకు పైగా ఉద్రిక్తంగా ఉన్న ఈశాన్య రాష్ట్రంలో తాజా రౌండ్ల హింస తర్వాత కర్ఫ్యూ సడలింపు పరిమితం చేశారు.