Site icon HashtagU Telugu

Free Bus Travel: జీరో టికెట్‌పై 87,994 మంది ప్రయాణించిన ఖమ్మం మహిళలు

Free Bus Travel

Free Bus Travel

Free Bus Travel: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకం అందుబాటులోకి వచ్చినప్పుడు ఆర్టీసీ మొదట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపిస్తేనే జీరో టిక్కెట్టు జారీ చేస్తారు

ఈ పథకం అందుబాటులోకి వచ్చిన సందర్భంలో ఆర్టీసీ మొదట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో జీరో టికెట్ జారీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు తమ ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపిస్తే జీరో టిక్కెట్టు జారీ చేస్తారు. ఈ క్రమంలో 15న జీరో టికెట్‌పై 87,994 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోలకు చెందిన 503 పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ , సిటీ బస్సుల్లో వీరు ప్రయాణించారు. ఆర్టీసీ అంచనా ప్రకారం ఉచితంగా ప్రయాణించిన వారి సంఖ్య 53 శాతం. వీరితోపాటు మరో 79,590 మంది టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణించారు. ఉచిత ప్రయాణానికి ఆదరణ లభిస్తున్నందున బస్సుల సంఖ్యను పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు.

Also Read: EX DSP Nalini Emotional Post : కన్నీరు పెట్టిస్తున్న డీఎస్పీ నళిని కథ..