Site icon HashtagU Telugu

Food Poison: వినాయక చవితి ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత

Ganesh Idol

Ganesh Idol

తెలుగు రాష్ట్రాల్లో  వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజుల నవరాత్రులలో, ప్రజలు ఉత్సాహంతో, భక్తితో పండుగను జరుపుకుంటారు. మరోవైపు తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో సందడి నెలకొంది. గ్రామంలోని ఆలయంలో పంచిన ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రసాదం తిన్న వెంటనే గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.

వెంటనే వైద్యశాఖ అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించారు. గ్రామంలోని ఇంటింటికీ భక్తులు ఆలయంలో వినాయక ప్రసాదాన్ని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ప్రసాదం తిని వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన గ్రామస్థులు ప్రస్తుతం కేవీబీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Pawan Kalyan: జనసేనకు గ్లాస్ గుర్తు, ఎన్నికల సంఘానికి పవన్ కృతజ్ఞతలు!