50 Killed: నైజీరియాలో బాంబ్ బ్లాస్ట్.. 50 మంది దుర్మరణం

నైజీరియా (Nigeria)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర నైజీరియా సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ (Explosion)లో దాదాపు 50 మందికి పైగా మరణించారు. నైజీరియాలోని బౌచి సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. కాగా.. మరణించిన వారిలో ఎక్కువ మంది పశువుల కాపరులు ఉన్నారని

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 08:37 AM IST

నైజీరియా (Nigeria)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర నైజీరియా సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ (Explosion)లో దాదాపు 50 మందికి పైగా మరణించారు. నైజీరియాలోని బౌచి సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. కాగా.. మరణించిన వారిలో ఎక్కువ మంది పశువుల కాపరులు ఉన్నారని నైజీరియా ప్రభుత్వ ప్రతినిధి, జాతీయ పశువుల పెంపకందారుల ప్రతినిధి వెల్లడించారు.

నైజీరియా ఉత్తర మధ్య ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో డజన్ల కొద్దీ పశువుల కాపరులు, స్థానికులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. నివేదికల ప్రకారం.. ఉత్తర మధ్య నైజీరియాలోని నసరవా, బెన్యూ రాష్ట్రాల మధ్య మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నైజీరియాకు చెందిన మియాతి అల్లా పశువుల పెంపకందారుల సంఘం ప్రతినిధి తసియు సులైమాన్ మాట్లాడుతూ.. ఫులానీ పశువుల కాపరులు తమ పశువులను బెన్యూ నుండి నసరవాకు తరలిస్తున్నారని, అక్కడ మేత వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించినందుకు అధికారులు జంతువులను జప్తు చేశారని చెప్పారు.

Also Read: Harassment By BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ప్రాణహాని.. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి రాజీనామా

రాయిటర్స్ ప్రకారం.. ఈ సంఘటనలో కనీసం 54 మంది మరణించారని సులేమాన్ చెప్పారు. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. నసరవా గవర్నర్ అబ్దుల్లాహి సూలే పేలుడులో మరణించిన వారి సంఖ్య గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. పేలుడు వెనుక ఎవరు ఉండవచ్చో చెప్పలేదు. అయితే తాను భద్రతా సంస్థలతో సమావేశమై దర్యాప్తు చేస్తున్నానని చెప్పారు.