5 Month Old Baby Raped : ఏపీలో ఘోరం.. 5 నెలల చిన్నారిపై అత్యాచారం

నాల్గు రోజులక్రితం మూడో తరగతి చదువుతున్న బాలిక ఫై ముగ్గురు మైనర్ బాలురులు అత్యాచారం చేసి చంపేసిన ఘటన..మొన్న తిరుపతి లో 6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

Published By: HashtagU Telugu Desk
5 Month Old Baby

5 Month Old Baby

ఏపీలో అత్యాచార ఘటనలు (Rape) ఏమాత్రం తగ్గడం లేదు. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. నాల్గు రోజులక్రితం మూడో తరగతి చదువుతున్న బాలిక ఫై ముగ్గురు మైనర్ బాలురులు అత్యాచారం చేసి చంపేసిన ఘటన..మొన్న తిరుపతి లో 6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం (65 year old man raped a 6 year old girl) చేసిన ఘటనలు మరవకముందే మరో దారుణం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

విజయనగరం జిల్లాలో (Vizianagaram district) 5 నెలల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి (5 Month Old Baby Raped) పాల్పడ్డాడు. జీలుగువలసలో వరుసకు తాత అయిన వ్యక్తి ఊయలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రరక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేయడం తో.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇలా వరుస ఘటన లపై వైసీపీ పార్టీ..అధికార పార్టీ ఫై నిప్పులు చెరుగుతుంది. అధికారంలోకి రాగానే అదిచేస్తాం..ఇది చేస్తామంటూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసారని..మహిళలకు , పసి బిడ్డలకు రక్షణ అనేది లేకుండా పోయిందని విమర్శలకు దిగారు.

Read Also : Tanikella Bharani : ఇవాళ తనికెళ్ల భరణి బర్త్‌డే.. ఆయన కెరీర్‌లోని ఆసక్తికర విశేషాలివీ

  Last Updated: 14 Jul 2024, 10:39 AM IST