Site icon HashtagU Telugu

4 Lost Life-Muharram : మొహర్రం ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురి మృతి

4 Lost Life Muharram

4 Lost Life Muharram

4 Lost Life-Muharram : జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 

మొహర్రం ఊరేగింపునకు సిద్ధమవుతున్న సమయంలో మతపరమైన జెండాకు విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలింది. 

దీంతో కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యక్తులు మరణించగా, 10 మంది గాయపడ్డారు.

Also read : International Tiger Day 2023 : ది టైగర్.. మన జాతీయ జంతువును కాపాడుకుందాం!

జార్ఖండ్‌లోని పెతర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖెత్కో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇనుముతో చేసిన మతపరమైన జెండా..  11,000 వోల్ట్  హై-టెన్షన్ వైర్‌కు తగిలడంతో కరెంట్ షాక్ కొట్టిందని బొకారో జిల్లా ఎస్పీ ప్రియదర్శి అలోక్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందన్నారు. గాయపడిన 10 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. నలుగురు చికిత్సపొందుతూ చనిపోయారు. ఇంకో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Also read :New Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆగస్టులో పలు కంపెనీల కొత్త కార్లు విడుదల..!