4 Killed: వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో నలుగురు కూలీలు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం యెల్లంద వద్ద ఖమ్మం-వరంగల్ హైవేపై చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి కూడా రాంగ్ రూట్‌లో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం అనంతరం ఆటో లారీలో ఇరుక్కుపోవడంతో పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, మృతులను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Also Read: Ram Charan fans: డైరెక్టర్ శంకర్ పై రామ్ చరణ్ అభిమానులు సీరియస్.. కారణమిదే!