RTC : ఆర్టీసీలో 3వేల నియామకాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. అక్యుపేన్సి గతంలో కంటే రెట్టింపు అయింది.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే సాధ్యం అవుతుందని వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.

Published By: HashtagU Telugu Desk
3000 recruitment will be done in RTC: Minister Ponnam Prabhakar

3000 recruitment will be done in RTC: Minister Ponnam Prabhakar

RTC :  ప్రభుత్వం వరంగల్ కి 112ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. ఈ క్రమంలోనే ఈరోజు హనుమకొండ హయగ్రీవ గ్రౌండ్‌లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక మొదటి దశగా ఈ రోజు 50 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ప్రారంభించారు. సంక్రాంతి లోపు మరో 25 బస్సులు రోడ్డెక్కనున్నాయి.. అనంతరం మిగిలిన బస్సులు రోడ్డు ఎక్కుతాయి.

ఈ సందర్భంగా తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… జిల్లాకు మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా ఈరొజు 50 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ కోసం కోట్లడిన ఆర్టీసీ ఉద్యోగులు బస్ కా పెయ్య నై చెలిగ అనే ఉద్యమాన్ని చేపట్టారన్నారు. వారికి 2013 బాండ్స్ ఇచ్చాం.. 21 శాతం పీఆర్సీ ఇచ్చామని… ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. అక్యుపేన్సి గతంలో కంటే రెట్టింపు అయింది.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే సాధ్యం అవుతుందని వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.

అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని… ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.. మహిళలు 4350 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారన్నారు. వెయ్యి బస్సులు ఎలక్ట్రిక్ రాష్ట్రంలో ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకున్నామన్నారు. ఈరోజు వరంగల్ లో మొదటి దశగా 50 బస్సులు ప్రారంభం చేసుకుంటున్నామని.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని భరోసా కల్పించారు. ఆర్టీసీ స్వతహాగా మరో 1000 బస్సులు కొనుగోలు చేస్తుందన్నారు.

Read Also: Two Young Fans Dead : పరిహారం ప్రకటించిన పవన్, చరణ్

  Last Updated: 06 Jan 2025, 03:20 PM IST