Site icon HashtagU Telugu

Explosion: పశ్చిమ బెంగాల్‌ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ముగ్గురు మృతి

New Web Story Copy 2023 05 16t160622.530

New Web Story Copy 2023 05 16t160622.530

Explosion: పశ్చిమ బెంగాల్‌ లో చట్టవిరుద్ధంగా నడుపుతున్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. దీంతో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు కారణంగా భవనం దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎగ్రా ప్రాంతంలో ఉన్న ఈ బాణసంచా ఫ్యాక్టరీ చట్టవిరుద్ధంగా నడుపుతున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. పేలుడు తాకిడికి రెసిడెన్షియల్‌ భవనంలో నడుస్తున్న ఫ్యాక్టరీ కూలిపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని, మరో నలుగురు గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. క్రాకర్స్ తయారు చేస్తున్న ఇంట్లోనే పేలుడు సంభవించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.

Read More: Heroines Summer Looks: సమ్మర్ సీజన్ లో సెగలు రేపుతున్న హీరోయిన్స్, లేటెస్ట్ పిక్స్ వైరల్!