Sikkim Bus Accident: సిక్కింలో బస్సు బోల్తా… 26 మంది విద్యార్థులకు గాయాలు

సిక్కింలో విద్యార్థుల బస్సు ప్రమాదానికి గురైంది. గ్యాంగ్ టక్‌ ప్రాంతంలో బస్సు బోల్తా పడింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ 26 మంది విద్యార్థులు గాయపడగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

Sikkim Bus Accident: సిక్కింలో విద్యార్థుల బస్సు ప్రమాదానికి గురైంది. గ్యాంగ్ టక్‌ ప్రాంతంలో బస్సు బోల్తా పడింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ 26 మంది విద్యార్థులు గాయపడగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

సిక్కింలో బస్సు ప్రమాద ఘటనలో 26 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వివరాలను స్థానికులని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి పూర్తి వివరాలు తెలియరాలేదు.

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో తూర్పు సిక్కిం జిల్లాలోని మఖా శివార్లలోని సింగ్‌బెల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన 26 మందిలో 23 మంది విద్యార్థులు కాగా ఒక డ్రైవర్, మరియు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సింగ్‌టామ్‌ ఆస్పత్రిలో చేర్పించగా… . తీవ్రంగా గాయపడిన 12 మందిని గ్యాంగ్‌టక్‌లోని STNM మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Read More: Telangana Politics: కాంగ్రెస్ వీడిన వాళ్లంతా వెనక్కి తిరిగి రావాలి: రేవంత్