Site icon HashtagU Telugu

Sucide Case: మాదాపూర్ హోటల్‌లో వ్యక్తి ఆత్మహత్య

Sucide Imresizer

Sucide Imresizer

Sucide Case: మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హేమంత్(25) ఏసీ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అయితే కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది మాదాపూర్ లోని ఓ హోటల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హోటల్ టెర్రస్‌పై ఇనుప రాడ్‌కు వేలాడుతూ కనిపించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల అతను తీవ్ర నిరాశకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు.

Read More: 200 People Missing : 200 మందితో బయలుదేరిన బోటు గల్లంతు.. ఏమైంది ?