Road Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా.. కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రదీప్, సోనీ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Chandrababu Arrest : కార్యకర్తలు సైలెంట్ ..జనసేనాధినేత దూకుడు