Crane Collapse-17 Died : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణ దశలో ఉన్న “సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే”పై ఘోరం జరిగింది.
థానే జిల్లాలోని షాపూర్ తహసీల్ వద్ద వంతెన నిర్మాణం కోసం గిర్డర్ లను పైకి ఎత్తి అందిస్తున్న క్రేన్ ప్రమాదవశాత్తు కూలింది..
దీంతో 17 మంది కార్మికులు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి.
Also read : X Sign Removed : ట్విట్టర్ “X” లోగో లైటింగ్ పై 24 కంప్లైంట్స్.. తొలగించిన అధికారులు
క్రేన్ దాదాపు 200 అడుగుల ఎత్తులో ఉండగా కూలిపోయి కార్మికుల మీద పడిందని గుర్తించారు. అయితే క్రేన్ ఎందుకు కూలిందనే వివరాలు తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని(Crane Collapse-17 Died) మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమృద్ధి మహామార్గ్ ను నాగ్‌పూర్-ముంబై మధ్య 701 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించిన రెండు దశల పనులు ఇప్పటికే పూర్తికాగా.. మూడో దశ పనులు జరుగుతున్నాయి.
Also read : England Level Series: బ్రాడ్ లాస్ట్ పంచ్.. ఇంగ్లండ్ దే యాషెస్ చివరి టెస్ట్..!