తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం హృదయ విదారక ప్రమాదం జరిగింది. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదం (Road Traffic Accident)లో సుమారు 17 మంది మరణించగా, 22 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. విచారణకు ఆదేశించారు.
నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన ఒక గంట తర్వాత, నాన్‌చాంగ్ కౌంటీ పోలీసులు డ్రైవర్‌ల కోసం ఒక సలహా జారీ చేసారు, ఇది వాతావరణం బాగా లేదని, దృశ్యమానత తక్కువగా ఉందని, కాబట్టి నెమ్మదిగా నడపమని పేర్కొన్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. దీనితో పాటు ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నెమ్మదిగా నడపాలని అధికారులు నాన్‌చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. చైనాలో రోడ్డు ప్రమాదాలు సాధారణం కావడానికి కఠినమైన భద్రతా నియంత్రణలు లేకపోవడం కూడా ఒక కారణం.