Site icon HashtagU Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో పెను విషాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు

Mexico Bus Crash

Road accident

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు మదారిపూర్ లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఎమాద్ పరిభాన్ నడుపుతున్న ఢాకా బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రుల్లో చేర్పించినట్లు మదారిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ మహ్మద్ మసూద్ ఆలం తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, మెకానికల్ లోపమే ప్రమాదానికి కారణమని స్థానిక న్యూస్ పోర్టల్ తెలిపింది.

ప్రమాదాన్ని వివరిస్తూ ఫరీద్‌పూర్ ఫైర్ సర్వీస్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ షిప్లు అహ్మద్ మాట్లాడుతూ.. వేగంగా వెళుతున్న బస్సు టైరు పగిలి అది అదుపు తప్పి లోయలో పడి నేలను బలంగా ఢీకొట్టడంతో చాలా మంది మృతి చెందారని భావిస్తున్నామని తెలిపారు. అగ్నిమాపక శాఖకు చెందిన మూడు వాహనాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అధికారి లిమా ఖానుమ్ తెలిపారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Also Read: Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఇమాద్ పరిభాన్ బస్సు 43 మంది ప్రయాణికులతో ఢాకాకు బయలుదేరిందని బస్ కౌంటర్ ఎండి సాబుజ్ ఖాన్ స్థానిక వార్తాపత్రికతో చెప్పారు. బంగ్లాదేశ్‌లో పాత, పేలవంగా నిర్వహించబడుతున్న వాహనాలు, రోడ్లు అలాగే తక్కువ శిక్షణ పొందిన డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి.

Exit mobile version