ఓ మైనర్ బాలుడి జరిపిన కాల్పుల్లో అమాయక పిల్లలు అయిన 8 మంది చనిపోయారు. ఈ ఘటన సెర్బియా కంట్రీలో జరిగింది. (Serbia) లోని బెల్‌గ్రేడ్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది పిల్లలు (Children) మరణించారు. సెర్బియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఒక సెక్యూరిటీ గార్డు కూడా మరణించాడని తెలుస్తోంది. ఆరుగురు పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. పాఠశాలను (School) లక్ష్యంగా చేసుకున్న 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లోని వ్రాకార్ ప్రాంతంలోని వ్లాడిస్లావ్ రిబ్నికర్ ఎలిమెంటరీ స్కూల్‌లో పాఠశాల కాల్పులు జరిగాయి. ఓ బాలుడు తన తండ్రి తుపాకీని (Gun Firing) వెంట తెచ్చుకొని కాల్పులు జరిపాడు. ఏ కారణం చేత కాల్పులు జరిపాడో తెలియదు కానీ పిల్లలపై కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మరణించారు. దీంతో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన సమయంలో పోలీస్ (Police) పెట్రోలింగ్ చేస్తుండటంతో పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చింది.
Also Read: 2 Terrorists Killed: జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం