Gang Rape: అస్సాంలో దారుణం.. కదులుతున్న కారులో మైనర్ పై అత్యాచారం

అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ళ మైనర్ పై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో ఆ బాలికను విచక్షణారహితంగా అత్యాచారానికి ఒడిగట్టారు.

Published By: HashtagU Telugu Desk
Gang Rape

New Web Story Copy 2023 05 18t192133.066

Gang Rape: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ళ మైనర్ పై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో ఆ బాలికను విచక్షణారహితంగా అత్యాచారానికి ఒడిగట్టారు. సమాజం తలదించుకునే ఈ ఘటన అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..

అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సాయంత్రం జాతీయ రహదారి 31సిపై కారులో ప్రయాణిస్తున్ననలుగురు నరరూప రాక్షసులు అటుగా వెళుతున్న బాలికను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రాంతం డోట్మా నగరానికి సమీపంలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు పిల్లల రక్షణ చట్టం, 2012 (పోక్సో) కింద డోట్మా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులను కోక్రాజార్‌లోని కోర్టులో హాజరుపరిచామని, మూడు రోజులపాటు పోలీసు రిమాండ్‌కు తరలించామని అధికారి తెలిపారు.

Read More: Nara Dishti Dosha: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!

  Last Updated: 18 May 2023, 07:22 PM IST