Site icon HashtagU Telugu

Revenue Department : రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు

10,954 posts sanctioned in the Revenue Department

10,954 posts sanctioned in the Revenue Department

Revenue Department : తెలంగాణలో రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేశారు. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు “జిపిఓ” గా నామకరణం చేసింది. కాగా రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. మళ్లీ గ్రామ పాలన అధికారులను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Read Also: Gold Prices: అల‌ర్ట్‌.. ఏప్రిల్ 2 నుండి పెర‌గ‌నున్న బంగారం ధ‌ర‌లు..!

కాగా, రాష్ట్రంలో మొత్తం 10,954 వరకు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న వీఆర్ఏ, వీఆర్వోలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర శాఖల్లోకి బదిలీ చేసింది. ధరణి పోర్టల్ వచ్చాక, వారిని రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు బదిలీ చేశారు. అయితే మాజీ వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో ధరణి రిజిస్ట్రేషన్ ని రద్దు చేస్తూ భూ భారతి చట్టం తీసుకొచ్చింది.

ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చ‌ట్టంలో భాగంగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను జీపీవో (గ్రామ పాలనా అధికారులు)గా తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ శాఖలో సంస్కరణల పేరిట వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూములకు సంబంధించిన అనుమతులు ఇచ్చి రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని మళ్లీ తీసుకొస్తుంది. వీఆర్వో, వీఆర్ఏ స్థానంలో గ్రామ పాలన అధికారులను నియమించేందుకు పది వేలకు పైగా పోస్టులు మంజూరు చేసింది.

Read Also: Mallareddy : పార్టీ మార్పు పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు