Site icon HashtagU Telugu

Maha Kumbh Devotees: ప్ర‌యాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది స్పాట్ డెడ్‌

Maha Kumbh Devotees

Maha Kumbh Devotees

Maha Kumbh Devotees: యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది భక్తులు (Maha Kumbh Devotees) మరణించగా, 19 మంది గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలన్నింటినీ మార్చురీలో భద్రపరిచారు. సమాచారం ప్రకారం, శుక్రవారం (ఫిబ్రవరి 14) అర్థరాత్రి ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

భక్తులంతా మ‌హా కుంభ‌మేళాకు వెళ్తున్న‌ట్లు సమాచారం

భ‌క్తుల‌తో బొలెరోలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. వీరందరి వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా వాసులు. మృతులు మ‌హా కుంభ‌మేళాకు వెళ్తున్న‌ట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది భక్తులకు కూడా గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రాంనగర్‌ సీహెచ్‌సీలో చేర్చారు. బస్సులో ప్రయాణిస్తున్న భక్తులందరూ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా వాసులు అని అధికారులు తెలిపారు.

Also Read: JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు.. ఆరోపణలివీ

సీఎం యోగి సంతాపం తెలిపారు

ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు. అంతే కాదు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఢీకొన్న శబ్ధం విని ఘటనా స్థలానికి పరుగులు తీశామని కేసు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించిన‌ట్లు వారు పేర్కొన్నారు. పోలీసులు గ్యాస్ కట్టర్‌తో బొలెరోను కట్ చేసి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. బ్యాగులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతులిద్దరినీ ఈశ్వరి ప్రసాద్, సోమనాథ్ దరిగా గుర్తించారు.