Insurance on Train: 35 పైసలకే రైలులో రూ.10 లక్షల ఇన్సూరెన్స్

ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో చౌకగా వచ్చే ఇన్సూరెన్స్ (Insurance) సదుపాయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు ప్రజలు

Insurance on Train : ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో చౌకగా వచ్చే ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు ప్రజలు. కేవలం 35 పైసలకే వస్తున్న జీవిత బీమాను కొనుగోలు చేసుకోవడం ఎంతో లాభదాయకం. దీన్ని ఎవరు ఎంపిక చేసుకోవడం లేదు. జీవిత బీమాను స్వచ్చంద ఎంపికగానే ఐఆర్ సీటీసీ అమలు చేస్తోంది. నిజానికి ఇంత తక్కువ రేటుకు వచ్చే బీమా మరేదీ లేదు. రైలు టికెట్ అంటే రూ.100 తక్కువ ఉండదు. అంత పెడుతున్నప్పుడు కేవలం 35 పైసల ఖర్చుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అదేమంత అవసరపడదులేనన్న ఉద్దేశ్యంతో ఎక్కువ మంది దానిపై ఆసక్తి చూపించడం లేదు.

ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం తర్వాత మరోసారి ఈ చౌక ఇన్సూరెన్స్ (Insurance) ఎంత విలువైనదో తెలియవచ్చింది. ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో ఈ బీమా సుదుపాయాన్ని కూడా ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బీమాను ఎంపిక చేసుకున్న వారికి.. ప్రమాదంలో మరణించినట్టయితే రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైలక్యం పాలైనా రూ.10 లక్షలు పొందవచ్చు . శాశ్వత పాక్షిక అంగవైకల్యం పాలైన వారికి రు.7.5 లక్షలు చెల్లిస్తారు. గాయాలతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే రూ.2 లక్షలు ఇస్తారు. శవ తరలింపునకు అయ్యే రవాణా వ్యయాల కోసం రూ.10వేలు చెల్లిస్తారు. ప్రయాణికులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన భీమా ఇది.

Also Read:  Coromandel Express : పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్!