World Television Day 2023 : ప్రత్యేకత ఏంటో..? టీవీని ఎవరు కనుగొన్నారో తెలుసా..?

మొదటగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి..ఆ తర్వాత కలర్ టీవీ లు వచ్చాయి. ఇప్పుడు ప్లాస్మా టీవీ, ఎల్.సి.డ్. టీవీ, ఎల్. ఇ. డి. టీవీ

Published By: HashtagU Telugu Desk
World Television Day 2023

World Television Day 2023

నవంబర్ 21 అంతర్జాతీయ టెలివిజ్ దినోత్సవం(World Television Day). ప్రతి ఏడాది ఈరోజు (నవంబర్ 21) న టీవీ పుట్టిన రోజుగా ప్రపంచం మొత్తం వేడుకలు జరుపుకుంటుంది. ప్రస్తుతం టీవీలు లేని ఇల్లు లేదు. ఉదయం లేచినదగ్గరి నుండి పడుకునేవరకు అంత టీవీ లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నో విషయాలు టీవీల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు , ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి ప్రపంచ విషయాలు తెలుపుతున్నాయి కానీ..స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు టీవీ ల ద్వారానే ప్రపంచంలో ఏంజరుగుతున్నాడనేది తెలుసుకునేవాళ్ళం.

టీవీని కనిపెట్టింది ఎవరంటే..

ముందుగా టీవీని 1924లో స్కాటిష్ ఇంజనీర్, జాన్ లోగీ బైర్డ్ కనిపెట్టారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) సహాయంతో భారతదేశంలో సెప్టెంబర్ 15, 1959న న్యూ ఢిల్లీలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో కమ్యూనిటీ హెల్త్, ట్రాఫిక్, రోడ్ సెన్స్ పౌరుల విధులు, హక్కులు వంటి వాటిపై వారంలో రెండు రోజులపాటు గంట సేపు కార్యక్రమాలు టీవీలో ప్రసారం చేశారు.

నవంబర్ 21, 1996న ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను నిర్వహించింది. ప్రముఖ మీడియా ప్రముఖులు ఫోరమ్‌లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‍కు పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి చర్చించారు. అప్పుడే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ప్రతి సంవత్సరం నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.

టీవీ పాత్ర :

ప్రతి ఏడాది ఈరోజున కమ్యూనికేషన్, ప్రపంచీకరణలో టెలివిజన్ పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి సమావేశాలు జరుగుతాయి. ప్రసార మాధ్యమాల పాత్రను ప్రజలకు గుర్తుచేస్తారు. రచయితలు, పాత్రికేయులు, బ్లాగర్లు, టీవీతో అనుబంధించబడే ఇతరులు ఈరోజు విశేషాల గురించి మాట్లాడడం..వారి అభిప్రాయాలని తెలియజేయడం చేస్తుంటారు.

మొదటగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి..ఆ తర్వాత కలర్ టీవీ లు వచ్చాయి. ఇప్పుడు ప్లాస్మా టీవీ, ఎల్.సి.డ్. టీవీ, ఎల్. ఇ. డి. టీవీ ఇలా రాకరకాలవి అందుబాటులోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ టీవీ ప్రసారాలలో మానవుడికి కావలసినవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ , మ్యూజిక్ , స్పోర్ట్స్ , ఫ్యాషన్ , జంతుప్రపంచం , హెల్త్ , న్యూస్ ఇలా ఒకటేంటి ఎన్ని కావాలో అన్ని అందుబాటులో ఉండి వినోదాన్ని పంచుతున్నాయి టీవీలు.

Read Also : TS Polls 2023 : తెలంగాణ లో వరుసగా మూడు రోజులు వైన్ షాప్స్ బంద్

 

  Last Updated: 21 Nov 2023, 11:06 AM IST