World Mosquito Day : దోమలకు కూడా ఒక రోజు ఉంది. అదే ఆగస్టు 20. ఇవాళ ‘ప్రపంచ దోమల దినం’గా జరుపుకుంటారు. దోమల వల్ల వచ్చే వ్యాధులపై ఇవాళ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్‌తో దోమల దినాన్ని జరుపుకుంటారు. థీమ్ అంటే నినాదం. ఏ అంశంపై ప్రధానంగా ప్రచారం చేయదలిచారో దానితో ముడిపడిన నినాదాన్ని ప్రకటిస్తారు. ఈ సంవత్సరానికి ‘‘ప్రపంచంలో సమసమానత్వం సాధన కోసం మలేరియాపై యుద్ధాన్ని ముమ్మరం చేయడం’’ అనే అంశాన్ని థీమ్‌గా ఎంచుకున్నారు. మలేరియా చికిత్సను, వైద్య పరీక్షలను అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, జికా ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ థీమ్‌ను(World Mosquito Day) ఎంపిక చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
వర్షాకాలంలో దోమలు యాక్టివ్ .. ఎందుకు ?
మన దేశంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఉన్న నీటిలో దోమలు తమ సంతానోత్పత్తి చేసుకుంటాయి. అనంతరం పరిసర ప్రాంతాల్లో నివసించే వారిపై దాడి చేస్తాయి. ఫలితంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, జికా ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు వస్తుంటాయి. ప్రత్యేకించి దేశంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దోమల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. సకాలంలో చికిత్స అందకపోవడం వల్లే అలా జరుగుతుంటుంది.
Also Read :Rains Alert : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం.. ఏపీలో కూడా..
ఆడ దోమల వల్లే మలేరియా వ్యాపిస్తుందని 1897 సంవత్సరం ఆగస్టు 20న ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ గుర్తించారు. దీంతో ఆ రోజునే ప్రపంచ దోమల దినాన్ని నిర్వహించాలని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రతిపాదించింది. నాటి నుంచే ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినం జరుగుతోంది. దోమల బెడద నుంచి మనల్ని మనం కాపాడుకుంటూనే ఆరోగ్య భారతం సాకారం అవుతుంది.