National Flag Day 2023 : మువ్వన్నెల జెండాకు 76వ బర్త్ డే నేడే.. హిస్టరీ తెలుసుకోండి

National Flag Day 2023 : మన దేశంలోని ప్రతి ఒక్కరు చూడగానే దేశభక్తిని ఫీల్ అయ్యే గొప్ప కారణం.. మువ్వన్నెల జాతీయ జెండా .. భారత జాతీయ పతాకానికి నేడు (జులై 22) 76వ పుట్టిన రోజు !!  

  • Written By:
  • Updated On - July 22, 2023 / 03:32 PM IST

National Flag Day 2023 : మన దేశానికి చిహ్నం.. 

మన దేశ ఆత్మగౌరవానికి ప్రతీక.. 

మన దేశ  సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనం.. 

మన దేశంలోని ప్రతి ఒక్కరు చూడగానే దేశభక్తిని ఫీల్ అయ్యే గొప్ప కారణం.. మువ్వన్నెల జాతీయ జెండా 

భారత జాతీయ పతాకానికి నేడు (జులై 22) 76వ పుట్టిన రోజు !!  

Also read : Wife Attack Husband : భర్త ప్ర‌వేట్ పార్ట్‌ల‌ను కోసిన భార్య‌.. కార‌ణం ఇదే..?

ప్రతి సంవత్సరం జూలై 22న “జాతీయ జెండా దినోత్సవాన్ని” మనం జరుపుకుంటాం. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు  కాలంలో.. చాలా ప్రాంతాలు వివిధ రాజవంశాల పాలనలో ఉండేవి. వాటిని సంస్థానాలు అని పిలిచేవారు. పలు సంస్థానాలు బ్రిటీష్ వాళ్లకు ప్రతి సంవత్సరం  కప్పం (ట్యాక్స్)  కడుతూ అధికారంలో చలామణి అయ్యేవి. ఆయా సంస్థానాలకు ఒక్కో దానికి ఒక్కో జెండా ఉండేది.  1857లో బ్రిటీష్ పాలకులపై సిపాయీల  తిరుగుబాటు జరిగింది. ఆ  తర్వాత మన దేశానికి  ఒక జెండా ఉంటే బాగుంటుందనే ఆలోచన మొదలైంది. చివరకు మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్ని రోజుల ముందు.. అంటే 1947 ఆగస్టులో రాజ్యాంగ పరిషత్ ను స్థాపించారు. స్వతంత్ర భారతదేశానికి కొత్త  జెండాను ఎంపిక చేయడానికి రాజ్యాంగ పరిషత్ 1947 జూన్ 23న తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. దానిలో సభ్యులుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, సరోజినీ నాయుడు, సి. రాజగోపాలాచారి, KM మున్షీ, BR అంబేద్కర్ ఉన్నారు. 1947 జూలై 22న(National Flag Day 2023) రాజ్యాంగ సభలో..  పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదించారు.

Also read : Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ఫొటోలు వైరల్!

1947 ఆగష్టు 15న మన దేశానికి బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం లభించడానికి  ముందు..  నెహ్రూ రెండు రకాల జెండాల మోడల్స్ ను  ప్రదర్శించారు. వీటిలో ఒక జెండా ఖాదీ పట్టుతో తయారు చేసింది కాగా..  మరో జెండా ఖాదీ పత్తితో తయారు చేయబడింది. ఒక జెండా..  ముదురు కుంకుమ, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగు సమ భాగాల్లో ఉన్న క్షితిజ సమాంతర త్రివర్ణ పతాకం. ఇంకో జెండా.. తెలుపు బ్యాండ్ మధ్యలో నీలం రంగులో ఉన్న అశోక చక్రంతో ఉంది. దీంతో రెండో జెండాను మన జాతీయ పతాకంగా ఎంపిక చేశారు. భారతదేశ జాతీయ పతాకం  పైభాగంలో లోతైన కుంకుమ (కేసరి) రంగు, మధ్యలో తెలుపు రంగు, దిగువన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి. జెండా మధ్యలో ఉన్న తెలుపు రంగు భాగంలో నేవీ బ్లూ కలర్ లో  చక్రం ఉంటుంది.   ఈ చక్రంలో 24 చువ్వలు ఉంటాయి. ఇది అశోకుని సారనాథ్ లయన్ క్యాపిటల్ అబాకస్‌పై కనిపించే చక్రాన్ని పోలి ఉంటుంది.

Also read : Mahesh Babu : లండన్ కు వెళ్తున్న మహేష్..గుంటూరు కారం కు మరో బ్రేక్..?