Site icon HashtagU Telugu

Jump From Space : ఆకాశం నుంచి దూకేసిన మొదటి యోధుడు ఇతడే !

Jump From Space

Jump From Space

Jump From Space : సంవత్సరం ‘2012’.. నెల ‘అక్టోబర్’.. తేదీ ‘14’.. ఆస్ట్రియాకు చెందిన హెలికాప్టర్ పైలట్ ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ మెక్సికోలోని రోస్‌వెల్ నుంచి హీలియం బెలూన్  సాయంతో అంతరిక్షంలోని స్ట్రాటోస్పియర్‌ కు  చేరుకున్నాడు. అక్కడి నుంచి భూమికి 39 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆకాశం నుంచి భూమిపైకి దూకాలనే తన డ్రీమ్ ను నెరవేర్చు కునేందుకు బామ్‌గార్ట్నర్  దూకేశాడు. అతను దూకిన తర్వాత.. చాలాసేపటి వరకు పారాచూట్ ను తెరవలేదు. ధైర్యంగా పారచూట్ లేకుండా భూమి వైపునకు దూసుకొచ్చాడు. భూమి ఉపరితలం నుంచి కొన్ని వేల మీటర్ల సమీపంలోకి చేరుకున్న తర్వాత పారాచూట్‌ను తెరిచాడు. ఈ టైంలోనూ అంతరిక్షం నుంచి భూమి వైపు గంటకు 1,000 కిమీ స్పీడ్ తో అతడు పడిపోసాగాడు.  ఒకానొక దశలో గంటకు 1,357.64 కి.మీ వేగంతో భూమి వైపునకు బామ్‌గార్ట్నర్ దూసుకొచ్చాడు. అతడి సూట్ లో అమర్చిన పరికరాలతో ఈ స్పీడ్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. గంటకు 1235 కిమీ ధ్వని వేగాన్ని ఈక్రమంలో అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం 10 నిమిషాల టైైంలోనే ఆకాశం నుంచి భూమిపైకి బామ్‌గార్ట్నర్  చేరుకున్నాడు. బామ్‌గార్ట్‌నర్ భూమిపైకి దిగుతున్నప్పుడు.. చివరి క్షణంలో అతడి హెల్మెట్ హీటర్ ఒకటి పనిచేయడం మానేసింది. అటువంటి పరిస్థితిలో అతడు వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల హెల్మెట్ ఆవిరితో నిండిపోయింది. ఈ ఎత్తైన జంప్ సమయంలో..  ప్రమాదాలను, శరీర గాయాలను నివారించడానికి ప్రత్యేక ప్రెజర్ సూట్‌ను బామ్‌గార్ట్‌నర్ ధరించాడు. ఈ సూట్‌లో ప్రత్యేక వాయు పీడనం ఉంటుంది. ఫలితంగా బయటి గాలి ఒత్తిడి శరీరాన్ని తాకదు.  ఈ సూట్.. అచ్చం వ్యోమగాముల సూట్ ను తలపించేలా ఉంటుంది.

Also read : Foods Good For Kidneys: కిడ్నీలో రాళ్లను నివారించండి ఇలా..!

ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ ఫ్లాష్ బ్యాక్ ఇదీ.. 

ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌లో 1969 ఏప్రిల్ 20న జన్మించిన బామ్‌గార్ట్నర్ 16 సంవత్సరాల వయస్సులోనే స్కైడైవింగ్ చేయడం ప్రారంభించాడు. స్కై డైవింగ్ లో తన స్కిల్స్ పెంచుకోవడానికి ఆస్ట్రియాలోని మిలిటరీ కౌన్సిల్‌లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. దీనివల్ల అతడు ప్రొఫెషనల్ స్కై డైవర్ గా ఎదిగేందుకు బాటలు పడ్డాయి. 43 సంవత్సరాల వయసులో (2012 అక్టోబరు 14న) అతడు ఆకాశం నుంచి భూమిపైకి దూకి రికార్డును నెలకొల్పాడు. అతడి రికార్డును  2014 అక్టోబరు 24న  అలాన్ యూస్టేస్ అనే స్కైడైవర్ బద్దలు కొట్టాడు. అలాన్ యూస్టేస్ 41.42 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమిపైకి దూకి కొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఆకాశం నుంచి భూమి వైపునకు వచ్చే క్రమంలో పారాచూట్ చాలా తక్కువగా వాడిన రికార్డు మాత్రం  బామ్‌గార్ట్‌నర్ ఖాతాలోనే ఉంది.  అలాన్ యూస్టేస్  అంతరిక్షం నుంచి దూకిన వెంటనే పారాచూట్ ను వాడటం మొదలుపెట్టాడు. బామ్‌గార్ట్‌నర్ చాలా దూరం పడిపోయే దాకా.. తన పారాచూట్ ను (Jump From Space)  ఓపెన్ చేయలేదు.