Site icon HashtagU Telugu

Brown Egg Vs White Egg : బ్రౌన్ ఎగ్ వర్సెస్ వైట్ ఎగ్.. ఏది తింటే మంచిదో తెలుసా ?

Brown Egg Vs White Egg Nutrients Info

Brown Egg Vs White Egg : గుడ్లు ఎన్నో రంగుల్లో లభిస్తుంటాయి. కొందరికి వైట్ ఎగ్స్ ఇష్టం.. మరికొందరికి బ్రౌన్​ ఎగ్స్ ఇష్టం. ఈ రెండింటి టేస్ట్ కూడా కొంత డిఫరెంటుగానే ఉంటుందని ఆహార ప్రియులు చెబుతుంటారు. అందుకే వీటి రేట్లలోనూ తేడా ఉంటుంది. అయితే వీటిలో ఏది తినాలో అర్థంకాక చాలామంది కన్ఫ్యూజ్(Brown Egg Vs White Egg) అవుతుంటారు. అలాంటి వారి డౌట్స్ క్లియర్ చేయడమే ఈ కథనం ఉద్దేశం.

Also Read :UPI Fraud Gang Arrested : తెలంగాణలో యూపీఐ స్కాం.. బజాజ్ షోరూంలకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా

  • కొందరు వైట్ ఎగ్స్‌ను తక్కువ అంచనా వేస్తుంటారు. బ్రౌన్ ఎగ్సే బెటర్ అని వాదిస్తుంటారు. అయితే ఆ వాదనకు ఎలాంటి సైంటిఫిక్ సాక్ష్యాలు లేవని మనం గుర్తుంచుకోవాలి. కోడిగుడ్డు పెంకు రంగులో తేడా ఉన్నంత మాత్రాన వాటిలోని పోషకాలు మారవని మనం అర్థం చేసుకోవాలి. కోడి జాతిని బట్టి మాత్రమే రంగు మారుతుందని మనం గ్రహించాలి.
  •  2019 సంవత్సరంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, తెలుపు, బ్రౌన్ రంగుల గుడ్లలో ఉండేే పోషక విలువలపై లోతైన రీసెర్చ్ చేశారు. ఈ రెండు రకాల గుడ్లలోనూ పోషక విలువలు సేమ్ టు సేమ్ ఉన్నట్లు వెల్లడైంది. ఈమేరకు వివరాలతో ‘న్యూట్రియంట్స్’ జర్నల్‌లో ఒక అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది.

Also Read :Autopsy Document Missing : జూనియర్ వైద్యురాలి పోస్టుమార్టం డాక్యుమెంట్ మిస్.. దీదీ సర్కారుపై ‘సుప్రీం’ ఫైర్

  • కొన్ని కోడిగుడ్లలో ప్రోటోపోర్ఫిరిన్ అనే పదార్థం ఉంటుందట. దానివల్ల ఆ గుడ్లపై ఉండే పెంకుకు ముదురు గోధుమ రంగు, ఎరుపు రంగు వస్తుందట. అయితే టేస్ట్ మాత్రం మారదట. అచ్చం వైట్ గుడ్డులాగే దీని టేస్ట్ కూడా ఉంటుందట.
  • అండలూసియన్, వైట్ లైఘోర్న్ అనే జాతులకు చెందిన కోళ్లు తెల్లటి కోడి గుడ్ల​ను పెడతాయట.
  • గోల్డెన్ కామెట్, రోడ్ ఐలాండ్ రెడ్, గోల్డ్ చికెన్ వంటి జాతులకు చెందిన కోళ్లు బ్రౌన్ రంగు కోడిగుడ్లను పెడతాయట.
  •  కానీ పైన మనం చెప్పుకున్న విషయాలు తెలియక జనాలు బ్రౌన్ ఎగ్స్ కొనేందుకు ఎగబడిపోతుంటారు. అందువల్ల వాటికి ఎక్కువ ధర పలుకుతుంటుంది.
  • బ్రౌన్ కలర్ కోడిగుడ్లు పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉన్నాయి. అందుకే ఆ రకం గుడ్లు తక్కువగా లభిస్తుంటాయి. ఇంకో విషయం ఏమిటంటే బ్రౌన్ కలర్ కోడిగుడ్లు పెట్టే కోళ్లను పెంచడానికి కాస్త ఎక్కువ ఖర్చవుతుంది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని  ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.