Site icon HashtagU Telugu

ULI : ‘యూఎల్‌ఐ’ వస్తోంది.. లోన్ల ప్రాసెసింగ్ ఇక మరింత స్పీడ్

Rbi Uli

ULI : మన దేశంలో డెవలప్ చేసిన యూపీఐ పేమెంట్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. చాలా విదేశాల్లోనూ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో ఇప్పుడు పేమెంట్స్ జరుగుతున్నాయి. త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మన ముందుకు యూఎల్‌ఐను తీసుకురానుంది.  యూఎల్ఐ అంటే.. యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌. లెండింగ్ అంటే లోన్లకు సంబంధించిన వ్యవహారం. యూపీఐ విధానంలో కేంద్ర బిందువు ‘పేమెంట్స్’..  యూఎల్ఐ విధానంలో కేంద్ర బిందువు  ‘లోన్లు’!! అంటే లోన్లు ఇచ్చే వాళ్లకు, తీసుకునే వాళ్లకు మరింత సౌలభ్యాన్ని అందించేలా యూఎల్‌ఐ విధానం ఉండబోతోందన్న మాట.

We’re now on WhatsApp. Click to Join

యూఎల్ఐ రాకతో చిన్నతరహా లోన్లు తీసుకునే సామాన్యులకు, లోన్లు పొందే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. యూఎల్ఐ(ULI) ప్లాట్‌ఫామ్‌లో రైతుల భూముల రికార్డుల సమాచారం కూడా అందుబాటులో ఉంటుందని తెలిసింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు లోన్లు మంజూరు చేసేందుకు డాక్యుమెంటేషన్ పెద్దగా అవసరం ఉండదు. డిజిటల్ ఫార్మాట్‌లోనే రైతుల భూముల రికార్డులు అందుబాటులో ఉండటంతో యూఎల్ఐ ద్వారా ఈజీగా, వేగంగా లోన్ అప్లికేషన్ల ప్రాసెసింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Dengue Cases : వామ్మో 4,294 డెంగీ కేసులు.. బాధితుల్లో ఎక్కువమంది పిల్లలే

మన దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను డెవలప్ చేసేందుకు ఆర్బీఐ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆర్బీఐ చొరవ వల్లే యూపీఐ టెక్నాలజీ అంతగా సక్సెస్ అయింది. ప్రపంచదేశాలు భారత్‌కు చెందిన యూపీఐ వైపే ఇప్పుడు చూస్తున్నాయి. చాలా దేశాలు ఈ తరహా టెక్నాలజీని మన దేశం నుంచి పొందుతున్నాయి. ఈ పరిణామం ఆర్థిక రంగంలో భారత్ లిఖించిన కొత్త అధ్యాయమే అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)తో యూపీఐ యాప్స్‌ను లింక్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ప్రాసెస్‌ను ఫోన్ పే పూర్తి చేసింది. అమెజాన్ పే, గూగుల్ పే కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. త్వరలోనే అవి కూడా బీబీపీఎస్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

Also Read :Women’s T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల

Exit mobile version