Digital Real Estate : ఇది డిజిటల్ యుగం. ఔనన్నా.. కాదన్నా.. అదే నిజం! అయితే అత్యంత లాభదాయకమైన వ్యాపారం మాత్రం రియల్ ఎస్టేటే !! రియల్ ఎస్టేట్ అంటే భూములు, ఇళ్లను కొనడం, అమ్మడం. అచ్చం ఇదే విధంగా ఈ డిజిటల్ యుగంలో మనం ‘డిజిటల్ రియల్ ఎస్టేట్’ చేసుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :99 Employees Fired : మీటింగ్‌కు డుమ్మా.. 99 మంది ఉద్యోగులను తీసేసిన సీఈఓ
‘రియల్ ఎస్టేట్’ అంటే.. మన కంటికి కనిపించే రియల్ ప్రాపర్టీ. డిజిటల్ లోకంలో కూడా చాలా రకాల అసెట్స్ ఉంటాయి. వాటిని కూడా మనం భూమిలా విలువైనగా భావించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మనం చూసే వెబ్‌సైట్ల పేర్లను కూడా మనం డిజిటల్ ప్రాపర్టీలుగా భావించాల్సి ఉంటుంది. పేర్లు, నెటిజన్స్ ట్రాఫిక్ ఆధారంగా వాటికి మార్కెట్లో ఒక విలువ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఔత్సాహికులు కొంటే.. ఆ వెబ్‌సైట్లకు తగినంత ధర లభిస్తుంది. గో డ్యాడీ, హోస్టింగర్ లాంటి వెబ్‌సైట్లలో వెబ్‌సైట్ నేమ్స్‌ను మనం కొనొచ్చు. చాలామంది మంచి వెబ్‌సైట్ నేమ్స్‌ను కొనేసి.. తమ వద్ద ఉంచుకుంటారు. ఎవరైనా ఔత్సాహికులు దాన్ని కొనేందుకు సిద్ధపడితే.. కొన్న రేటుపై మంచి లాభం చూసుకొని అమ్మేస్తుంటారు. డిజిటల్ రియల్ ఎస్టేట్(Digital Real Estate) వ్యాపారం ఇలాగే నడుస్తుంటుంది.
Also Read :Delhi Pollution : ఢిల్లీలో ఇక ‘గ్రేప్-4’.. మాకు చెప్పకుండా ఆంక్షలు సడలించొద్దు.. సుప్రీం ఆదేశాలు
కొన్ని వెబ్‌సైట్ల పేర్లకు సడెన్‌గా భారీ రేటు పలికిన టైం కూడా ఉంది. అయితే అన్ని రకాల నేమ్స్‌కు ఈ రేంజులో రేటు వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఇలాంటి వ్యాపారాన్ని పార్ట్ టైంగా మాత్రమే చేయాలి. అదనపు ఆదాయం కోసం దీన్ని వాడుకోవడం ఉత్తమం. ఫుల్ టైం కోసం డిజిటల్ రియల్ ఎస్టేట్ పనికిరాదు.ఎవరి దగ్గరైనా మంచి వెబ్ సైట్ నేమ్స్ ఉంటే.. వాటిని ఫ్లిప్పా (Flippa) వంటి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో అమ్మేయొచ్చు. అక్కడ మనం అమ్మదల్చిన వెబ్ సైట్ నేమ్, పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. ఆసక్తి కలిగిన వారు దాన్ని చూసి.. బిడ్డింగ్ దాఖలు చేస్తారు.